S. P. Balasubrahmanyam feat. S. Janaki - Chinnari - From "Swathi Muthyam" Songtexte

Songtexte Chinnari - From "Swathi Muthyam" - S. P. Balasubrahmanyam , S. Janaki




ప్చ్ చ్ చ్ ప్చ్ చ్ చ్
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా... చ్ చ్.చ్ చ్
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య... చ్ చ్.చ్ చ్
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో మా నాన్నా నిన్నూ ఊరడించనేనున్నా
నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరోకా.చ్ చ్.చ్ చ్
తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో.చ్ చ్.చ్ చ్
వెన్నకై దొంగలా వెళ్ళితివేమో
మన్ను తిని చాటుగా దాగితివేమో
అమ్మా మన్ను తినంగ నే శిశువునో ఆకొంటినో వెర్రినో చూడు నోరు ఆ
వెర్రిది అమ్మేరా... వెర్రిదీ అమ్మేరా... పిచ్చిదాని కోపం... రా
పచ్చి కొట్టి వెళ్దామా బూచికిచ్చి పోదామా
ఏడుపొత్తోంది నాకేడుపొత్తోంది
పచ్చికొట్టిపోయామా పాలెవరు ఇత్తారు
బూచాడికి ఇచ్చామా బువ్వెవరు పెడ్తారు చెప్పూ
అమ్మతోనే ఉంటాము అమ్మనొదిలి పోలేమూ
అన్నమైన తింటాము తన్నులైన తింటాము
కొట్టమ్మ కొట్టు బాగా కొట్టు ఇంకా కొట్టూ కొట్టూ
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారు నిన్నెవరు కొట్టారమ్మ
చిన్నవాడవైతేనూ చెయ్యెత్తి కొట్టేనూ
పెద్దవాడవైతేనూ బుద్ధిమతి నేర్పేను
యశోదనూ కానురా నిన్ను దండించ
సత్యనూ కానురా నిన్ను శాసించ
ఎవ్వరు నువ్వనీ... ఎవ్వరు నువ్వనీ నన్నూ అడగకు
ఎవరూ కాననీ విడిచీ వెళ్ళకూ
నన్నూ విడిచీ వెళ్ళకూ
ఆ వెళ్ళమూ వెళ్ళము లేమ్మా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా.
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య...
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో మా నాన్నా నిన్నూ ఊరడించనేనున్నా.ఆ నేను ఊరుకోను
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా.లలలలాల
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య... లలలలాల



Autor(en): ILAIYARAAJA, ILAYARAJA, ACHARYA ATREYA



Attention! Feel free to leave feedback.