S. P. Balasubrahmanyam - Kaluvaku Chandrudu (From "Chillara Devullu ") Songtexte

Songtexte Kaluvaku Chandrudu (From "Chillara Devullu ") - S. P. Balasubrahmanyam




కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం...
కలువకు చంద్రుడు ఎంతో దూరం...
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైనా కొలదీ పెరుగును అనురాగం
దూరమైనా కొలదీ పెరుగును అనురాగం
విరహంలోనే ఉన్నది అనుబంధం
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది
నవ్వే అదృష్టం ఎందరికుంటుంది
కన్నీరైనా వెచ్చగ ఉంటుంది
అది కలిమి లేములను మరిపిస్తుంది
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
వలపు కన్నా తలపే తీయన
కలయిక కన్నా కలలే తియ్యన
చూపుల కన్నా ఎదురు చూపులే తియ్యన
నేటికన్నా రేపే తీయన
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
మనసు మనిషిని మనిషిగా చేస్తుంది
వలపా మనసుకు అందాన్నిస్తుంది
రెండు లేక జీవితమేముంది
దేవుడికి మనిషికి తేడా ఏముంది



Autor(en): K V MAHADEVAN, ATHREYA, MAHADEVAN K V



Attention! Feel free to leave feedback.