S. P. Balasubrahmanyam - Ye Divilo Virisina (From "Kanne Vayasu") Songtexte

Songtexte Ye Divilo Virisina (From "Kanne Vayasu") - S. P. Balasubrahmanyam




ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో
నామదిలో నీవై నిండిపోయెనే .
ఏదివిలో విరిసిన పారిజాతమో. ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో ...
నీరూపమె దివ్య దీప మై నీనవ్వులె నవ్య తారలై నాకన్నుల వెన్నెల కాంతి నింపెనే ...
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో.
పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే .
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...
పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగారావే .
నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే ...
కాలి అందియలు గల్లుగల్లుమన
కాలి అందియలు గల్లుగల్లుమన రాజహంసలారావే.
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో... నామదిలో నీవై నిండిపోయెనే.
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...
నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపినదినీవే.
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే.
నిదురమబ్బులను మెరుపుతీగవై కలలురేపిందినదీవే.
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించింది నీవే.
పదముపదములో మధువులూరగా ... పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే...
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో... నామదిలో నీవై నిండిపోయెనే .
ఏదివిలో విరిసిన పారిజాతమో ఏకవిలో మెరిసిన ప్రేమగీతమో...
సినిమా: కన్నెవయిస్సు (1973)
సంగీతం: సత్యం
Singers: SPB(బాలూ), susheela
సాహిత్యం: దాశరధి



Autor(en): SATHYAM, DASARATHI



Attention! Feel free to leave feedback.