A.R. Rahman, Karthik & Shreya Ghoshal - Vintunnavaa Lyrics

Lyrics Vintunnavaa - Shreya Ghoshal , Karthik




పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లో అణుచుకున్నా
మౌనముతో
నీ మదిని
బంధించా మన్నించు ప్రియా
తరిమే వరమా
తడిమే స్వరమా
ఇదిగో జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
వింటున్నావా వింటున్నావా
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలి సారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ... బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఏమో ఏమో ఏమవుతుందో
ఏదేమైనా నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇకపైన వింటున్నావా ప్రియా
గాలిలో తెల్ల కాగితంలా
నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపి నువ్వే రాసిన పాటలనే వింటున్నా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా
ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి
ఆద్యంతం ఏదో అనుభూతి
అనవరతం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భూతలమ్ కన్నా ఇది వెనుకటిది
కాలంతోన పుట్టింది కాలంలా మారే మనసే లేనిది ప్రేమ
రా ఇలా కౌగిళ్ళల్లో నిన్ను దాచుకుంటా
నీ దానినై నిన్నే దారిచేసుకుంటా
ఎవరిని కలువని చోటులలోన
ఎవరిని తలువని వేళలలోన
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
వింటున్నావా
విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలి సారి నీ మాటల్లో
పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
చాలు చాలే చెలియా చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ... బతికుండగా నీ పిలుపులు నేను విన్నా



Writer(s): AR RAHMAN, ANANTHA SRIRAM



Attention! Feel free to leave feedback.