A.R. Rahman, Mahalakshmi & Hariharan - Nelluri Nerajana (From "Oke Okkadu") Lyrics

Lyrics Nelluri Nerajana (From "Oke Okkadu") - Hariharan , Mahalakshmi

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెంట ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెలే
అరికాలు మరిచి అడవి చెట్టు పూచెనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే
తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతూ బదులీవే
పెదవిపై పెదవుంచి మాటలను జుర్రుకుని
వేళ్ళతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది
నీ అందానికెదురేది
నువ్వు తాకే చోట తీపెక్కులే
ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే చెలియా
నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరుమాట
వెలుగంటి చూపు
దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో
ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించిపోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా
చంపదలచు మరణమైనా మాయమయా
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలకా పెదవెంట ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకుంటా

Writer(s): A R Rahman, A M Ratnam

A.R. Rahman, Mahalakshmi & Hariharan - Hits Of A.R. Rahman
Album Hits Of A.R. Rahman
date of release
06-01-2014

Attention! Feel free to leave feedback.