Anudeep Dev feat. Lipsika - Okanoka Illu Lyrics

Lyrics Okanoka Illu - Lipsika , Anudeep Dev



ఒకానొక ఇల్లు ఉందంట
జల్లు కూడ తట్టుకోదంట
రాత్రి పిడుగు మీద పడెనంట
క్షణంలోన ఇల్లు కూలేనట
రోజు ఒకానొక ఏటి మీద
ఒక నావ సాగుతుంటే
వెల్లువొచ్చి యేరు పొంగి నావ మునిగెనే
ఒకే ఒక చెట్టు కింద
ఊరి జనం ఒదిగిరంట
చెట్టు కొమ్మ విరిగెనంట కథ ముగిసెనే
ముగిసినావన్నీ మళ్ళీ మొదలైయ్యేదెప్పుడో
తలచినావన్నీ ఇక జరిగేది ఎన్నడో
నా ఆశ ఒకటే నేనానందంలో తేలుతూ
ఒక రోజైనా ఉంటే చాలులే చాలు
అంతులేని శోకాన నే దారి లేక తెన్ను లేక తేలనా
మోడుబారిన లోకాన నే కొత్త కొత్త చిగురులు చూడనా
మంటలోన నే వేగుతుండగా సుడిగాలి నన్ను నేడు తాకెనా
చింతలోన నే చిక్కి ఉండగా చిక్కులన్నీ నేడు వీడునా
పొగమంచే కారు చిచ్చులాగ మారినదే
నా గుండెల్లో శోక కడలి పొంగెనే
వాడిన పూలే మళ్ళీ మళ్ళీ విరబూయునో
కోరినావన్నీ నాకేనాడు దొరకునో
నా ఆశ ఒకటే నేనానందంలో తేలుతూ
ఒక రోజైనా ఉంటే చాలులే
ముగిసినావన్నీ మళ్ళీ మొదలైయ్యేదెప్పుడో
తలచినావన్నీ ఇక జరిగేది ఎన్నడో
నా ఆశ ఒకటే నేనానందంలో తేలుతూ
ఒక రోజైనా ఉంటే చాలులే చాలు



Writer(s): Anirudh Ravichander, Rajshri Sudhakar


Anudeep Dev feat. Lipsika - Coco Kokila (Original Motion Picture Soundtrack)



Attention! Feel free to leave feedback.