K. S. Chithra - Telusuna - From "Sontham" Lyrics

Lyrics Telusuna - From "Sontham" - K. S. Chithra



తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలికా
అడగనా అడగనా అతడినే మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏవిటో అని బయటపడలేకా
ఎలా ఎలా దాచిఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది . ||తెలుసునా||
అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది
పెదవి చివరే పలకరింపు నిలిచిపోతోంది
కొత్త నేస్తం కాదుగా ఇంత ఖంగారెందుకో
ఇంత వరకు లేదుగా ఇప్పుడు ఏమైందో
కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక ||తెలుసునా||
గుండెలోతుల్లో ఏదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతని తలపే నిండిపోయుంది
నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు
గుండెలో చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని ||తెలుసునా||
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా



Writer(s): DEVI SRI PRASAD, SIRIVENNELA SITARAMA SASTRY, CHEMBOLU SEETHARAMA SASTRY


K. S. Chithra - Devi Sri Prasad: Telugu Love Songs
Album Devi Sri Prasad: Telugu Love Songs
date of release
13-11-2014



Attention! Feel free to leave feedback.