K.K feat. Pawan Kalyan, Iliyana & ParvathiMelton - My Heart Lyrics

Lyrics My Heart - Pawan Kalyan , K.K



My heart is beating అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ
పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి
కనులలో వెతికితే దొరుకుతుందీ
Tea-spoon Tonne బరువవుతుందే
Full-moon నన్ను ఉడికిస్తుందే
Cloud nine కాళ్ళకిందకొచ్చిందే
Landmine గుండెలో పేలిందే
My heart is beating అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ
(Hey i wanna be with you forever
Hey i wanna live with you forever)
పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా
మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా
ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా
నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా
తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
Cellphone నీ కబురు తెస్తుంటే
Sten gun మోగినట్టు ఉంటుందే
Crompton fan-u గాలి వీస్తుంటే
Cyclone తాకినట్టు ఉంటుందే
My heart is beating అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ
ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం
మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం
త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం
యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం
గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం
తహతహగా తరిమినదే धाम अरे धाम అని తూలే ఆనందం
Freedom దొరికినట్టు గాలుల్లో
Welcome పిలుపు వినిపిస్తుందే
బాణం వేసినట్టు విల్లో
ప్రాణం దూసుకెళ్ళిపోతుందే
My heart is beating అదోలా తెలుసుకోవా అదీ
ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోంది మదీ



Writer(s): Bob Merrill


K.K feat. Pawan Kalyan, Iliyana & ParvathiMelton - Jalsa (Original Motion Picture Soundtrack)
Album Jalsa (Original Motion Picture Soundtrack)
date of release
13-10-2014




Attention! Feel free to leave feedback.