Karunya feat. Suchitra - Manasavacha Lyrics

Lyrics Manasavacha - Suchitra , Karunya



మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించా
మనసను ఢిల్లీ కోటకు నిన్నే రాణిని చేశా
కర్త కర్మ క్రియ నాకు నువ్వే ప్రియా
నా వలపుల సీమకు రాజువి నువ్వే రారా దోరా
కదిలే వెన్నెల శిల్పం నీవ్వని కన్నుల్లో కొలువుంచా
కురిసే మల్లెల జడిలో ప్రేయసి నువ్వేనని తలచా
మదనుడు పంపిన వరుడే నువ్వని మనవే పంపించా నా మనసే అర్పించా
మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించా
మనసను ఢిల్లీ కోటకు నిన్నే రాణిని చేశా
కర్త కర్మ క్రియ నాకు నువ్వే ప్రియా
నా వలపుల సీమకు రాజువి నువ్వే రారా దోరా
దిక్కులు నాలుగు అని అందరూ అంటున్నా
కాదు ఒక్కటే నని నిన్నే చూపిస్తా
ప్రాణాలు అయిదు అని ఎందరో చెబుతున్నా
ఒకటే ప్రాణమని మననే చూపిస్తా
ఎన్నడు వాడిని ప్రేమకు ఋతువులు ఆరె కాదమ్మా
జంటగా సాగుతూ పెళ్లికి అడుగులు ఏడె వేద్దామా
అష్టైశ్వర్యం మనకందించే వరమే ప్రేమా ప్రేమకు మనమే చిరునామా
మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించా
మనసను ఢిల్లీ కోటకు నిన్నే రాణిని చేశా
కన్నులు ఉన్నవిలా చూసేటందుకులే
నా కంటికి వెలుతురులా నువ్వుంటే చాల్లే
పెదవులు ఉన్నవిలా నిన్ను పిలిచేటందుకులే
పిలిచే పేరోకటే నీదైతే చాల్లే
పాదం ఉన్నది కడవరకు నీతో నడిచేందుకులే
అందం ఉన్నది నీ కౌగిట్లో అలిసేటందుకులే
హృదయం ఉన్నది తనలో దాచేటందుకులే
అది ఇక సొంతం నాకే
మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించా
మనసను ఢిల్లీ కోటకు నిన్నే రాణిని చేశా
కర్త కర్మ క్రియ నాకు నువ్వే ప్రియా
నా వలపుల సీమకు రాజువి నువ్వే రారా దోరా
మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించా
మనసను ఢిల్లీ కోటకు నిన్నే రాణిని చేశా
మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించా
మనసను ఢిల్లీ కోటకు నిన్నే రాణిని చేశా



Writer(s): VANDEMATARAM SRINIVAS, KALUVA KRISHNA SAI


Karunya feat. Suchitra - Seema Sastry
Album Seema Sastry
date of release
28-12-2007



Attention! Feel free to leave feedback.