Lyrics




పిల్ల గాలుల పల్లకీలో
మల్లె మధువై నీలో చేరి
నిన్ను చూస్తూ నన్ను నేనే వెదుకుతుంటున్నా
మరచి విశ్వము మరచి నేనే
మరచి సర్వము నన్ను నేనే
మౌనమే మకరందమవుతూ మురిసిపోతున్నా
కన్న కలలే వెన్నెలవుతూ
కన్నులెదుటే విరగబూసే
ఎన్ని జన్మల పుణ్య ఫలమో
నిన్ను కలిసితిని
అలుకలన్నీ ఆవిరయ్యే
వేదనంతా వేడుకయ్యే
చీకటంతా వెలుతురయ్యే
చెలిమి తోడయ్యే
ఆకశములో చందమామ కొలను పూసిన
కలువ భామ
నేల నడిచెను కలసి మెలసి
కొత్త దారులలో
పలుకు తేనెల గోరు వంకతో
పంజరములో రామచిలుకను
కలిపి నడిపిన బ్రహ్మ రాతను
మార్చు వారెవరో
గోరు వెచ్చని నింగి మనసు
ఆకు పచ్చని నేల సొగసు
కలసి కమ్మని తోడునీడై అడుగులేసేనా
నేల రాలిన చినుకు వానగు
వాన నీరే పారు ఏరగు
పారు ఏరులే
పొంగి పొరలుతు సంద్రమయ్యెనుగా
అంత సంద్రమే ఆవిరవుతు
మబ్బు లోపలే చేరే నీరై
అట్టి నీరే చిట్టి చినుకై
మట్టి తాకెనుగా
మనసులొకటై మమతలొకటై
ఆశలొకటై బాసలొకటై
పరిమళించిన జంట మల్లెలు
జతను వీడేనా



Writer(s): Pavan Kumar, Uma Maheswar Rao Copyright: Madhura Entertainment



Attention! Feel free to leave feedback.
Loading
Loading