S. P. Balasubrahmanyam - Allaye Digivachchi - Original Lyrics

Lyrics Allaye Digivachchi - Original - S. P. Balasubrahmanyam



అల్లాయే దిగివచ్చి
అల్లాయే దిగివచ్చి
ఆయ్ మియ ఏమి కావాలంటే.??
మిద్దె లొద్దు, మేడ లొద్దు పెద్దలెక్కే గద్దె లొద్దంట
ఉన్న నాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే
ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావలంటాను
స్నేహమే నా జీవితం
స్నేహమే రా శాశ్వతం
స్నేహమే నా జీవితం
స్నేహమే రా శాశ్వతం
స్నేహమే నాకున్నది. స్నేహమే రా పెన్నిధి
స్నేహమే
స్నేహమే నా జీవితం
స్నేహమే రా శాశ్వతం
స్నేహమే నా జీవితం
స్నేహమే రా శాశ్వతం
గుండెనే పలికించితే
గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి
మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయి
బాధలను ప్రేమించు భాయీ
బాధలను ప్రేమించు భాయ్... లేదు అంతకుమించి హాయ్
ఓయ్
స్నేహమే నా జీవితం
స్నేహమే రా శాశ్వతం
స్నేహమే నా జీవితం
స్నేహమే రా శాశ్వతం
హొయ్
కత్తిలా పదునైన చురుకైన మావాడు
మెత్తబడి పోయాడు ఎందుకో ఈనాడు
కత్తిలా పదునైన చురుకైన మావాడు
మెత్తబడి పోయాడు ఎందుకో ఈనాడు
ఏవిటో నీ బాధ
ఏవిటో నీ బాధ నాకయినా చెప్పు భాయి
రహస్యం కాస్త ఇకనైన విప్పవోయి
రహస్యం కాస్త ఇకనైన విప్పవోయి
నిండుగా నువ్వు నేడు నవ్వాలి
అందుకు నేను ఏమి ఇవ్వాలోయ్
నిండుగా నువ్వు నేడు నవ్వాలి
అందుకు నేను ఏమి ఇవ్వాలి...?
చుక్కలను కోసుకొని తెమ్మాంటావా.?
దిక్కులను కలిపేయమంటావా...?
దింపమంటావా.??
దింపమంటావా చంద్రుడిని.??
తుంచమంటావా సూర్యుడిని
ఏమి చేయలన్నా చేస్తాను
కోరితే ప్రాణమైనా ఇస్తాను
ఏమి చేయలన్నా చేస్తాను
కోరితే ప్రాణమైనా ఇస్తాను
దోస్తీకి నజరానా
దోస్తీకి నజరానా. చిరునవ్వు రా నాన్న
దోస్తీకి నజరానా. చిరునవ్వు రా నాన్న
ఒక్క నవ్వే చాలు. వొద్దులే వరహాలు
నవ్వేరా. హా
నవ్వేరా మావాడు... నవ్వేరా నిండుగా
నవ్వేరా మావాడు... నవ్వేరా నిండుగా
నవ్వేరా నా ముందు రంజానూ పండుగా
స్నేహమే
స్నేహమే నా జీవితం
స్నేహమే రా శాశ్వతం
స్నేహమే నా జీవితం
స్నేహమే రా శాశ్వతం



Writer(s): SATHYAM, DR. C NARAYANA REDDY, REDDY DR C NARAYANA


S. P. Balasubrahmanyam - Nippulanti Manishi
Album Nippulanti Manishi
date of release
01-12-1974




Attention! Feel free to leave feedback.