S. P. Balasubrahmanyam - Mallelu Pooche (From "Intinti Raamayanam ") Lyrics

Lyrics Mallelu Pooche (From "Intinti Raamayanam ") - S. P. Balasubrahmanyam




మల్లెలు పూసే వెన్నెల కాసే రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే రేయి హాయిగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా.
మల్లెలు పూసే వెన్నెల కాసే రేయి హాయిగా
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మొజులే నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మొజులే నీ విరజాజులై...
మిస మిస వన్నెలలో మిల మిలమన్నవిలె
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలే
మనసులు పాడే మంతనమాడే పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే రేయి హాయిగా...
ఆ.ఆహ.ఆ.ఆహ.అ.ఆహ...
తొలకరి కోరికలే తొందర చేసినవే...
విరి సెయ్యకే ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవే...
విరి సెయ్యకే ఆవిరి తీరగా...
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో చెఱ వీడగా.
అందిన పొందులోనె అందలేని విందులీయవె
కలలిక పండే కలయిక నేడే కావాలి వేడిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కా... సే రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే
చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు



Writer(s): RAJAN NAGENDRA, VETURI SUNDARA RAMAMURTHY


Attention! Feel free to leave feedback.