S. P. Balasubrahmanyam - Nenoka Prama Pipaasini (From "Indra Dhanussu") Lyrics

Lyrics Nenoka Prama Pipaasini (From "Indra Dhanussu") - S. P. Balasubrahmanyam



ఆ.ఆ... ఆ.హ... ఆ.ఆ... ఆ.హ...
ఆఆఆ... ఆ.హ... ఆ.హ
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని...
తలుపు మూసిన తలవాకిటినే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసిన తలవాకిటినే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని...
పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షనూ పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని...
పగటికి రేయి . రేయికి పగలు. పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని...



Writer(s): K V MAHADEVAN, ATHREYA, MAHADEVAN K V


Attention! Feel free to leave feedback.