S. P. Balasubrahmanyam - Pranathi Pranathi (Male Version) [From "Swathi Kiranam"] Lyrics

Lyrics Pranathi Pranathi (Male Version) [From "Swathi Kiranam"] - S. P. Balasubrahmanyam



సా రి రి రీ
రి
సా రి ని ని రి రీ సా
ప్రణతి ప్రణతి ప్రణతి
రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి
పమప మమప నీ
ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రధమ కళా సృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి...
పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పైరు పాపాలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా హ్రీంకారమా
గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడి శ్రీంకారమా శ్రీంకారమా
బీజాక్షర విగతికి అర్పించే జ్యోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి...
పంచ భూతముల పరిష్వంమున ప్రకృతి
పొందిన పదస్పందన అది కవనమా
పా పా పా
నిపపాప నిపపాప నిపాపపమా
గా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన
కేలనా అది నటనమా అది నటనమా
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సువర్ణ లేఖనా
అది చిత్రమా అది చిత్రమా
మౌన శిలల చైతన్య మూర్తులుగా మలచిన
సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా
అది శిల్పమా అది శిల్పమా
లలితా కళా సృష్టికి అర్పించే జ్యోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రధమ కళా సృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి...
చిత్రం; స్వాతికిరణం
గానం: ఎస్.పి.బాలు, వాణి జయరాం



Writer(s): VETURI, K V MAHADEVAN


S. P. Balasubrahmanyam - Ammani Padave: S. P. Balasubrahmanyam Hits
Album Ammani Padave: S. P. Balasubrahmanyam Hits
date of release
08-06-2015




Attention! Feel free to leave feedback.