Shankar Mahadevan - Ramanna Ramanna Lyrics

Lyrics Ramanna Ramanna - Shankar Mahadevan



రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
అదిగో అతడే అడుగులు వేస్తే అరెరె భూకంపం
హేయ్ భగ భగ భగమండే నిప్పులకొండకు అతడే ప్రతిరూపం
సూర్యుడు రెండుగ పగిలాడా తన కన్నులుగా మిగిలాడా
జీవితమే ఒక యుద్ధం అయితే అతనెపుడు సంసిద్ధం
యుద్ధం అతడే గెలుపు అతడే సర్వం సకలం సమస్తమతడే
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
【వినోద్ కుమార్】
ఎవడైనా పొగరెక్కి అవమానం చెయ్యాలని వచ్చాడా
ఎవడైనా పొగరెక్కి అవమానం చెయ్యాలని వచ్చాడా
ముఖమే కమిలి తలదించుకొని వెనుతిరిగేదే కాయం
ఆకాశం నుండి విషసర్పాలను చూసే డేగతడు
ఉక్కు పిడికిలే బిగిసిందా నేలకు చెమటే పడుతుంది
కంటిచూపు మేర అతడిది కానిదేది లేదు
తన పరగణపై పగ సారించిన కలియుగ రావణ బ్రహ్మతడే
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
【వినోద్ కుమార్】
సింగంలా గర్జించి కనుబొమ విరిచి తలవిదిలించాడా
సింగంలా గర్జించి కనుబొమ విరిచి తలవిదిలించాడా
హేయ్ తొడలే చరిచే ఉన్మాదులకు పిడుగుబాటు అతడు
శత్రువింటికెల్లి ప్రళయమేఘమై ప్రతిధ్వనిస్తాడు
చూపుడువేలు ఎత్తాడా గాలికి ఊపిరి ఆడదురా
ఎవడికి తెలుసు వజ్రమంటి తన గుండెలో ఏముందో
పరులకు తెలియని రక్తఘోషలో అశ్రుతర్పణంతో
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
【వినోద్ కుమార్】
కృతజ్ఞతే కనరాని జనాలపైనా ఎందుకురా జాలి
కృతజ్ఞతే కనరాని జనాలపైనా ఎందుకురా జాలి
పూజలే అంటే పిరికితనంతో చదివే మంత్రాలా
దేవతలంటే ఎవరూ చేసిన పూజలు గుర్తులేని రాళ్ళా
పాపం పుణ్యం ఇక నుండి పాదరక్షలుగా తొక్కేసెయ్
మంచి మమత మానవత్వమాచించవ తనవారై
అసాధ్యాలను సాధ్యం చేసే నువ్వే రాయలసీమకు రాజు
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి




Shankar Mahadevan - Rayalaseema Ramanna Choudary (Original Motion Picture Soundtrack)




Attention! Feel free to leave feedback.