V. Ramakrishna feat. P. Susheela - Jabilli Lyrics

Lyrics Jabilli - V. Ramakrishna feat. P. Susheela



జాబిల్లి చూశేను నిన్నూ నన్నూ ఓయమ్మో
నాకెంత సిగ్గాయె బావా బావా నను వీడలేవా
పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ ఓయబ్బో
నీకింత సిగ్గేల బాలా రావా నను చేరరావా
ఆకాశమార్గాన అందాల మేఘాలు పెనవేసుకున్నాయి చూడూ
చిగురాకు సరదాలు చిరుగాలి సరసాలు గిలిగింతలాయేను నేడూ
అందచందాలతో ప్రేమ బంధాలతో జీవితం హాయిగా సాగనీ
బాలా రావా నను చేరరావా
కొమ్మపై ఉన్న అందాల చిలకలు అనురాగ గీతాలు పాడేనూ
సిరిమల్లె ఒడిలోన చిన్నారి తుమ్మెద మైమరచి కలలందు కరిగేనూ
ముద్దు మురిపాలతో భావరాగాలతో యవ్వనం పువ్వులా నవ్వనీ
బావా బావా నను వీడలేవా
బంగారు చెక్కిళ్ళ పొంగారు పరువాలు కొనగోటి మీటులే కోరేనూ
నీ లేత అధరాలు ఎంతెంతొ మధురాలు ఈనాడు నా సొంతమాయేనూ
దేవి దీవించెను స్వామి వరమిచ్చెను ఇద్దరం ఏకమౌదాములే
బాలా బాలా నను చేరరావా
జాబిల్లి చూశేను నిన్నూ నన్నూ
ఓయబ్బో
నాకెంత సిగ్గాయె బావా బావా నను వీడలేవా
పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ
ఓయమ్మో
నీకింత సిగ్గేల బాలా రావా నను చేరరావా
అహా
ఆహా
అహ
అహా




V. Ramakrishna feat. P. Susheela - Mahakavi Ashethrayya (Original Motion Picture Soundtrack)



Attention! Feel free to leave feedback.