Yazin Nizar - Peddha Peddha Kallathoti Lyrics

Lyrics Peddha Peddha Kallathoti - Yazin Nizar




పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే, పిల్లా
అల్లిబిల్లి నవ్వుతోటి
నా బుల్లి బుల్లి మనసు తాకి
గిల్లి గిల్లి చంపినావే, బాలా
చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు
నన్ను చుట్టుముట్టాయే నీ ఊహలే
పుట్టలోన వేలు పెడితే చీమ కుట్టినట్టు
నన్ను పట్టి కుట్టాయిలే
పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే, పిల్లా
Oh yeah
ఓ' english భాషమీద పట్టులేదే
తెలుగులోని ఛందస్సు చదవలేదే
హిందీలో शायरी మనకు రాదే
నాలో కవిత్వాల ఘనత నీదే
ఆత్రేయ గొప్పతనం తెలుసుకున్నా
వేటూరి చిలిపిదనం మెచ్చుకున్నా
ఎన్నాళ్ళోనుంచో విన్న పాటలైనా
ఈరోజే నాకు నచ్చి పడుతున్నా
పాతికేళ్ళకొచ్చాకే నడక నేర్చినట్టు
అడుగుకెన్ని తప్పటడుగులో
పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే, పిల్లా
భూకంపం అంటే భూమి ఊగిపోవడం
Cyclone అంటే ఉప్పెనొచ్చి ముంచడం
రెంటికన్నా చాలా పెద్ద ప్రమాదం
గుప్పెడంత గుండెలోకి నువ్వు దూరడం
ఒంట్లోన వేడి పెరిగితే చలిజ్వరం
నిద్దట్లో ఉలికిపాటు పేరు కలవరం
రెంటికన్నా చాలా వింత లక్షణం
తెల్లార్లూ నీ పేరే కలవరించడం
ఇన్నినాళ్ళు నా జంటై ఉన్న ఏకాంతం
నిన్నుచూసి కుల్లుకుందిలే
పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే, పిల్లా




Attention! Feel free to leave feedback.