A.R. Rahman, Chinmayi & Devan Ekambaram - Manasaa paroles de chanson

paroles de chanson Manasaa - A. R. Rahman , Devan Ekambaram , Chinmayi Sripada




ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో
ఆఖరికి వాళ్ళనే చోట కలిపేస్తాడు
మనసా
మళ్లీ మళ్లీ చూశా
గిల్లీ గిల్లీ చూశా
జరిగింది నమ్మేశా
జతగా
నాతో నిన్నే చూశా
నీతో నన్నే చూశా
నను నీకు వదిలేశా
పైలోకంలో వాడు
ఎపుడో ముడి వేశాడు
విడిపోదే విడిపోదే
తను వానవిల్లంట
నువు వానజల్లంట
నీలోన ప్రేమ కిరణం కిరణం
తను కంటిపాపంట
నువు కంటిరెప్పంట
విడదియ్యలేమంట ఎవ్వరం ఎవ్వరం
మనసా
మళ్లీ మళ్లీ చూశా
నీ కళ్లలో చూశా
నూరేళ్ల మన ఆశ
జతగా
నాతో నిన్నే చూశా
నా తోడల్లే చూశా
నీ వెంట అడుగేశా
తియ్యనైన చీకటిని తలుచుకునే వేకువలు
హాయి మల్లెతీగలతో వేచి ఉన్న వాకిళులు
నింగీ నేలా గాలి
నీరూ నిప్పూ అన్నీ
అదిగో స్వాగతమన్నాయి
తను వానవిల్లంట
నువు వానజల్లంట
నీలోన ప్రేమ కిరణం కిరణం
తను కంటిపాపంట
నువు కంటిరెప్పంట
విడదియ్యలేమంట ఎవ్వరం ఎవ్వరం
మనసా
మళ్లీ మళ్లీ చూశా
నీ కళ్లలో చూశా
నూరేళ్ల మన ఆశ
జతగా
నాతో నిన్నే చూశా
నా తోడల్లే చూశా
నీ వెంట అడుగేశా
పైలోకంలో వాడు
ఎపుడో ముడి వేశాడు
విడిపోదే విడిపోదే
తను వానవిల్లంట
నువు వానజల్లంట
నీలోన ప్రేమ కిరణం కిరణం
తను కంటిపాపంట
నువు కంటిరెప్పంట
విడదియ్యలేమంట ఎవ్వరం ఎవ్వరం
ప్రేమ జగం విడుచు క్షణం పెళ్లి అనుకుంటే
పెళ్లి యుగమే ముగిసేది మరణంతోనే



Writer(s): AR RAHMAN, ANANTHA SRIRAM



Attention! N'hésitez pas à laisser des commentaires.