Hariharan - Andaala Devatha paroles de chanson

paroles de chanson Andaala Devatha - Hariharan



అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత
శతకోటి పూలూ ఉన్నాయి కాని
చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత
తెలిమంచు సైతం నిను తాకితే
చలి తాలలేక మేనువణకదా
పూబాల సైతం నిను చేరితే
పూవంటు నిన్నే సిగను ముడవదా
అమృతమున్న చోట ఆయువుంట దంట
నీ అందమందుకుంటే అమృతమెందుకంట
నీ పెదవి వొంపు పదవి చాలు భువినేను గెలవనా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత
సుడిగాలి అననా నీ చూపునీ
నేనందు లోన చిక్కినాననీ
సిరివెన్నెలననా నీ నవ్వునీ
యదలోన నింపి వెలిగినాననీ
పసిడిమువ్వ లల్లి కాలి గొలుసు కడతా
రెండు మువ్వలూడి పడితే కంటి పాప లెడతా
నిను ద్వీప మల్లె కాపుకాచి కడలల్లె మారుతా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత
శతకోటి పూలూ ఉన్నాయి కాని
చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత



Writer(s): VETURI, S.A.RAJ KUMAR


Hariharan - Cheppave Chirugalee... (Original Motion Picture Soundtrack)




Attention! N'hésitez pas à laisser des commentaires.