A. R. Rahman - E Devi Varamo (From "Amrutha") paroles de chanson

paroles de chanson E Devi Varamo (From "Amrutha") - Hariharan

ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్.
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే.
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్.
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే.
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా.
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా.
ఆయువడిగినది నీ నీడే...
ఆయువడిగినది నీ నీడే.
గగనం ముగియు దిశ నీవేలే.
గాలి కెరటమై సోకినావే.
ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే.

ఎదకు సొంతం లే ఎదురు మాటవు లే.
కలికి వెన్నెలలే కడుపు కోతవులే.
స్వాతి వానని చిన్న పిడుగని.
స్వాతి వానని చిన్న పిడుగని.
ప్రాణమైనది పిదప కానిది.
ప్రాణమైనది పిదప కానిది.
మరణ జనన వలయం నీవే.
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా.
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్.
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే.
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్.
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే.
సిరుల దీపం నీవే కరువు రూపం నీవే.
సరస కావ్యం నీవే తగని వాక్యం నీవే.
ఇంటి వెలుగని కంటి నీడని.
ఇంటి వెలుగని కంటి నీడని.
సొగసు చుక్కవో తెగిన రెక్కవో.
సొగసు చుక్కవో తెగిన రెక్కవో.
నేనెత్తి పెంచిన శోకంలా.
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా.
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా: ఆయువడిగినది నీ నీడే...
ఆయువడిగినది నీ నీడే.
గగనం ముగియు దిశ నీవేలే.
గాలి కెరటమై సోకినావే.
ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే.
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా.

Writer(s): Veturi, A R Rahman

Attention! N'hésitez pas à laisser des commentaires.