paroles de chanson Innirasula - From "Sruthilayalu" - S. P. Balasubrahmanyam , Vani Jayaram
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి. కూటమి కలిగిన రాశి. ఇంతి చెలువపు రాశి
కలికి బొమ విండ్లుగల కాంతకును. ధనురాశి
మెలయు మినాక్షికిని. మీనరాశి
కలికి బొమ విండ్లుగల కాంతకును. ధనురాశి
మెలయు మినాక్షికిని. మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును. కుంభరాశి
వెలగు హరిమధ్యకును. సింహరాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి. ఇంతి చెలువపు రాశి
చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు. మకరరాశి
కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి
చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు. మకరరాశి
కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి
వన్నెమైపైడి తులదూగు వనితకు. తులరాశి
వన్నెమైపైడి తులదూగు వనితకు. తులరాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి... వృశ్చికరాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
ఆముకొని నొరపుల మెరయు నతివకు. వృషభరాశి
గామిడి గుట్టుమాటల సతికి. కర్కాటక రాశి
ఆముకొని నొరపుల మెరయు నతివకు. వృషభరాశి
గామిడి గుట్టుమాటల సతికి. కర్కాటక రాశి
కోమలపు చిగురుమోవి కోమలికి. మేషరాశి
ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ. మిథున రాశి
ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ. మిథున రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి

Attention! N'hésitez pas à laisser des commentaires.