S. P. Balasubrahmanyam - Jabilli Kosam (Male Version) - From "Manchi Manasulu" paroles de chanson

paroles de chanson Jabilli Kosam (Male Version) - From "Manchi Manasulu" - S. P. Balasubrahmanyam



జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
పువ్వులనే నీ నవ్వులుగా
చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలి ఉర్రూతలూగి
మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నీ పేరొక జపమైనది... నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది... ఎన్నళ్ళయినా
నీ పేరొక జపమైనది... నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది... ఎన్నళ్ళయినా
ఉండీ లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నా నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై



Writer(s): acharya athreya, ilayaraja


S. P. Balasubrahmanyam - Manchi Manasulu (Original Motion Picture Soundtrack)




Attention! N'hésitez pas à laisser des commentaires.