S. P. Balasubrahmanyam feat. P. Susheela - Chukkalu Paade paroles de chanson

paroles de chanson Chukkalu Paade - S. P. Balasubrahmanyam feat. P. Susheela

చుక్కలు పాడే శుభమంత్రం.మ్మ్.మ్మ్... మ్మ్
దిక్కులు నిండే దివ్యమంత్రం మ్మ్.మ్మ్... మ్మ్
ఎక్కడనో ఎపుడో ఎవరో పలికిన వేదమంత్రం
ఇక్కడనే ఇపుడే ఎవరో...
నా చెవిలో ఊదిన మంత్రం మధు మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం... మ్మ్.మ్మ్... మ్మ్
రెక్కలపై గువ్వల జంట... ఆ... ఆఆఅ
రేకులలో పువ్వుల జంట... ఆ... ఆఆఆఆ
రెక్కలపై గువ్వల జంట
రేకులలో పువ్వుల జంట
సాగుచునే... ఊగుచునే...
మధుర మధురముగ మక్కువగ
చదువుకునే ఆనంద మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం... మ్మ్.మ్మ్... మ్మ్
కన్నులు ఒకపరి మూసుకొనీ... ఈ.ఈ
నీవన్నది మరి మరి తలచుకొనీ... ఈ.ఈ
కన్నులు ఒకపరి మూసుకొనీ
నీవన్నది మరి మరి తలచుకొనీ
ఒక్కతెనే... నేనొక్కతెనే...
అదే పనిగనే సదా మనసులో
ఆలపించే ప్రియ మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం... మ్మ్.మ్మ్... మ్మ్
కోవెల దైవం పిలిచేదాకా... ఆ... ఆఆఆఆ
ఆవలి ఒడ్డున నిలిచేదాకా... ఆ... ఆఆఆఆ
కోవెల దైవం పిలిచేదాకా
ఆవలి ఒడ్డున నిలిచేదాకా
నాలోనే... లోలోనే...
నాతిచరామి నాతిచరామి
అది నా ప్రాణ మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం.మ్మ్.మ్మ్... మ్మ్
దిక్కులు నిండే దివ్యమంత్రం మ్మ్.మ్మ్... మ్మ్
ఎక్కడనో ఎపుడో ఎవరో పలికిన వేదమంత్రం
ఇక్కడనే ఇపుడే ఎవరో...
నా చెవిలో ఊదిన మంత్రం మధు మంత్రం
చుక్కలు పాడే శుభమంత్రం... మ్మ్.మ్మ్... మ్మ్
రచన: దేవులపల్లి కృష్ణశాస్ర్తి

Writer(s): Devulapalli Krishna Sastry

Attention! N'hésitez pas à laisser des commentaires.