Hariharan feat. Mahalakshmi - Kala Anuko Kalad Anuko - From "Aazaad" текст песни

Текст песни Kala Anuko Kalad Anuko - From "Aazaad" - Hariharan feat. Mahalakshmi




కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
ఓ... నిను చూడనీ నిశిరాతిరి
నిదరైనపోని కనుల పాపవో
ఒహో హో... నిను తాకని నిమిషాలలో
కునుకైన రాక కుమిలే భాదవో
గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
ఏ తోటవైనా నీ పూజకేలే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
ఓ... మలి సందెలో నులి వెచ్చగా
చలి దాచుకున్న చనువే హాయిలే
ఓ... నడిరేయిలో నడుమెక్కడో
తడిమేసుకున్న గొడవే తీపిలే
ఓ... వీణల్లో తీగలా తీగల్లో మూగలా
మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా
నా పాట వింటే నీ పైట జారే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా



Авторы: mani sharma, veturi


Hariharan feat. Mahalakshmi - Veturi - Evergreen Telugu Love Songs, Vol. 1
Альбом Veturi - Evergreen Telugu Love Songs, Vol. 1
дата релиза
20-03-2015




Внимание! Не стесняйтесь оставлять отзывы.