Текст песни Hylessa - Devi Sri Prasad , M.M. Keeravani
హోలేసా . హోలేసా . హోలేసా... హోలే హోలేసా
ఏటయ్యిందే గోదారమ్మా
ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు
ఎదురుచూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడా ఎడమకన్ను అదురుతోంది నీమీదొట్టు
మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ
హోలేసా . హోలేసా . హోలేసా... హోలే హోలేసా
ఏటయ్యిందే గోదారమ్మా
క్రిష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట
ఎంకన్నకు పాలుదాపిన పాడావుల ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడత పిల్లల ఉరుకులాట
చెప్పకనె చెబుతున్నవి... చెప్పకనే చెబుతున్నవి
మన సీతరామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ
హోలేసా . హోలేసా . హోలేసా... హోలే హోలేసా
ఏటయ్యిందే గోదారమ్మా
ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు
ఎదురుచూస్తున్నది గట్టు ఏమైనట్టు
సెట్టుకి పందిరెయ్యాలని పిచ్చిపిచ్చి ఆశ నాది
ముల్లోకాలని కాసేటోణ్ణి కాపాడాలనే పిచ్చినాది
నీడనిచ్చే దేవునికే నీడనిచ్చే ఎదురుచూపు
ఇన్నాళ్లకి నిజమయ్యే వివరం కనబడుతున్నది
రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని సేవకెవరో మనసుపడే వస్తున్నట్టూ...
హోలేసా . హోలేసా . హోలేసా... హోలే హోలేసా
ఏటయ్యిందే గోదారమ్మా
ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు
ఎదురుచూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడా ఎడమకన్ను అదురుతోంది నీమీదొట్టు
మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ
హోలేసా . హోలేసా . హోలేసా... హోలే హోలేసా
హోలేసా . హోలేసా . హోలేసా... హోలే హోలేసా
హోలేసా . హోలేసా . హోలేసా... హోలే హోలేసా
Внимание! Не стесняйтесь оставлять отзывы.