Текст песни Ekshvaku Kula - Shankar Mahadevan
ఇక్ష్వాకు కుల తిలకా . ఇకనైన పలుకవే
రామచంద్రా. నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా!
చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా!
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా!
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా!
ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా!
సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకమూ రామచంద్రా!
ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా!
కలికీతురాయి నీకూ పోలుపుగా జేయిస్తినీ.రామచంద్రా!
నీ తండ్రి దశరధ మహరాజు పంపెనా!
లేక నీ మామ జనక మహరాజు పెట్టెనా!
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా!
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా!

Внимание! Не стесняйтесь оставлять отзывы.