S. P. Balasubrahmanyam feat. S. Janaki - Banti Chamanti (From "Abhilasha") текст песни

Текст песни Banti Chamanti (From "Abhilasha") - S. P. Balasubrahmanyam , S. Janaki




బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీమందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీమందారం పెళ్ళాడుకున్నాయిలే
తేనె వాగుల్లో మల్లెపూలల్ల్లె తేలిపోదాములే
గాలి వానల్లో మబ్బుజంటల్లే రేగిపోదాములే
విసిరే కొసచూపే ముసురైపోతుంటే
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే
వేడెక్కి గుండె ల్లో తలదాచుకో
పాదాలలో ఉన్న తడి ఆర్చుకో
ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీమందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
తారతా... తరరా తరరా... తారతా... తరరా తరరా...
పూత పెదవుల్లో ముద్దు గోరింకా బొట్టుపెట్టిందిలే
ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గుతీరిందిలే
ఒదిగే మనకే దో ఒకటై పొమ్మంటే
ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే
కాలాలు కరిగించు కౌగిళ్ళలో
దీపాలు వెలిగించు నీ కళ్ళతో
మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీమందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని
నిద్దరనే సెలవడిగీ ఇద్దరినీ కలవమని
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
రచన: ఆత్రేయ
గానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి



Авторы: ILAYARAJA, VETURI


Внимание! Не стесняйтесь оставлять отзывы.