S. P. Balasubrahmanyam - Erraroi (From "Raja Vikramarka") текст песни

Текст песни Erraroi (From "Raja Vikramarka") - S. P. Balasubrahmanyam



యరరోయి...
సూర్యుణ్ణి జాబిల్లి వాటేసుకుంది. ఏహ్.
యరరోయి... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. ఏహ్.
యరరోయి... సూర్యుణ్ణి జాబిల్లి వాటేసుకుంది.
యరరోయి... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
తాగినోళ్లా తందనాలు...
వాగకుంటే వందనాలు...
తైతక్కలాడెటి రెచ్చుక్కనే చూసి కైపెక్కిపొతారు
యరరోయి... సూర్యుణ్ణి జాబిల్లి వాటేసుకుంది.
యరరోయి... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
(Music)
ఓరెరెరెరెరె...
పల్లవొచ్చే నా గొంతులో. ఓహోయ్...
ఎల్లువొచ్చే నా గుండెలో. ఓహోయ్...
పుట్టుకోచ్చే ఎన్నెన్ని రాగాలో...
మందుకొట్టి ఒళ్లేందుకో. ఓహోయ్...
చిందులేసే తుళ్ళింతలో. ఓహోయ్...
కైపులోన ఎన్నెన్ని కావ్యాలో...
రేపన్నదే లేదని ఉమ్మర్రు ఖయ్యాము అన్నాడురా...
నేడన్నదే నీదని గుడిపాటి చలమయ్య చెప్పాడురా...
రసవీర... కసితీర...
ఏరింటి చేపల్లె గాలింటి గువ్వల్లే నే తెలిపోతారోయి... యరారోయి...
సూర్యుణ్ణి జాబిల్లి వాటేసుకుంది.
యరరోయి... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. యః ఆహా||
(Music)
దేవదాసు తాగడురా. ఓహోయ్...
వేదమేదొ చెప్పాడురా. ఓహోయ్...
విశ్వధాభిరాముణ్ణి నేనేరోయి...
ఒంటికేమో ఈడోచ్చేరా... ఓహోయ్...
ఇంటికొస్తె తోడేదిరా... ఓహోయ్...
పుత్తడంటి పూర్ణమ్మ యాడుందో...
శృంగార శ్రీనాథుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా
సంసార స్త్రీనాథుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తానురా...
ప్రియురాలా... జవారాలా...
నీ చేప కన్నల్లే నీ కంటి పాపల్లె నేనుండిపోతాలే...
యరరోయి... సూర్యుణ్ణి జాబిల్లి వాటేసుకుంది.
యరరోయి... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
తాగినోళ్లా తందనాలు...
వాగకుంటే వందనాలు...
తైతక్కలాడెటి రెచ్చుక్కనే చూసి కైపెక్కిపొతారు...
యరరోయి... సూర్యుణ్ణి జాబిల్లి వాటేసుకుంది.
యరరోయి... మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది
యరారోయి... ఎహ్...



Авторы: raj-koti, veturi


S. P. Balasubrahmanyam - Chiranjeevi: Telugu Dancing Hits, Vol. 1
Альбом Chiranjeevi: Telugu Dancing Hits, Vol. 1
дата релиза
20-03-2015




Внимание! Не стесняйтесь оставлять отзывы.