S. P. Balasubrahmanyam - Vakrathunda текст песни

Текст песни Vakrathunda - S. P. Balasubrahmanyam




వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ!
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా!!
.ఆ... ఆ.ఆ
జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక
.ఆ... ఆ.ఆ .ఆ... ఆ.ఆ
బాహుదా నది తీరములోన బావిలోన వెలసిన దేవా
మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావ
ఇష్టమైనది వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు వరములనొసగుచు నిరతము పెరిగే మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం
జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక
పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైనావు
మాతాపితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగ మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు
బ్రహ్మండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తిని కూర్పగ లక్ష్మీగణపతివైనావు
వేద పురాణములఖిలశాస్త్రములు కళలు చాటును నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం
జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయకా ...!
జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయకా ...!
.ఆ... ఆ.ఆ .ఆ... ఆ.ఆ
చిత్రం: దేవుళ్ళు
రచన: జొన్నవిత్తుల
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గానం: ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం




Внимание! Не стесняйтесь оставлять отзывы.