V.Ramakrishna - Yedho Yedho Annadi - From "Mutyala Muggu" текст песни

Текст песни Yedho Yedho Annadi - From "Mutyala Muggu" - V.Ramakrishna




ఏదో ఏదో అన్నది మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు
ఏదో ఏదో అన్నది మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు
ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం
ముడుచుకొనే కొలది మరి మిడిసిపడే సింగారం
సోయగాల విందులకై వేయి కనులు కావాలి
మ్మ్.మ్మ్.మ్మ్
ఏదో ఏదో అన్నది మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు
నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు
పులకరించు మమతలతో పూలపాన్పు వేసారు
మ్మ్.మ్మ్.మ్మ్
ఏదో ఏదో అన్నది మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు.
ఆ... ఆ.ఆ... మ్మ్.మ్మ్.మ్మ్
చిత్రం: ముత్యాల ముగ్గు (1975)
రచన: ఆరుద్ర
సంగీతం: కె.వి.మహదేవన్
గానం: వి.రామకృష్ణ



Авторы: K.V.MAHADEVAN K.V.MAHADEVAN, C NARAYANA REDDY


Внимание! Не стесняйтесь оставлять отзывы.