Unni Menon feat. M. G. Sreekumar & Kavita Krishnamurthy - Dhandiya Songtexte

Songtexte Dhandiya - Kavita Krishnamurthy , Unni Menon , M. G. Sreekumar




దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించినా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేయనా ఈనాడు
తనజాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
...
నిన్ను చూసి నన్ను నేను మరచి
చెప్పలేదు మూగబోయి నిలిచి
మనసులోన దాగివున్న ఆమాట తెలిసిందా
నిన్ను చూసి నాలో నేను మురిసి అసలుమాట చెప్పకుండా దాచి
కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా
కాటుకల్లే నేను కనుల చేరుకుంటా కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
పూలవోలే విరిసి నేను కున నల్లుకుంటా
... కళ్లలోనా కాటుక కరిగిపోవునంట కురులలోనా పువ్వులన్ని వాడిపోవునంట
నీ ప్రేమ హృదయమే పొందేనా తాళిబొట్టు నీకు నే కట్టేనా
ఈమాట మాత్రమే నిజమైతే నాజన్మే ధన్యం నాప్రేమ నీవేలే నాప్రేమ నీవేలే
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించినా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేయనా ఈనాడు
తనజాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా
ప్రేమని చూపులో వుంది మహత్మ్యం
ప్రేమభాషలో వుంది కవిత్వం
ప్రేమించుటలో వున్నది దైవత్వం దైవత్వం
ప్రేమసృష్టికే మూలపురుషుడు
ప్రేమ జీవులకు పూజనీయుడు
ప్రేమలేనిదే ఏమౌనో ఈలోకం భూలోకం
... నామనసు నీలో దాచి ఉంచినాను
మనసు క్షేమమేనా తెలుసుకొనగ వచ్చాను
... నీ మనసు పదిలంగా దాచి వుంచినాను
నాకంటే నీమనసే నాపంచప్రాణాలు
హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు
ఈమాట మాత్రమే నిజమైతే నాజన్మే ధన్యం
నాప్రేమ నీవేలే నాప్రేమ నీవేలే
యువతీ యువకుల కలయికకోసం
వచ్చెను నేడొక రాతిరి దాండియా అను ఒక రాతిరి
యువతీ యువకుల కలయికకోసం
వచ్చెను నేడొక రాతిరి దాండియా అను ఒక రాతిరి
మీకు తోడు మేముంటాము నేస్తమా
జంకులేక ప్రేమించైండి నేస్తమా
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి



Autor(en): A.M. RATNAM, A R RAHMAN, A M RATNAM, ALLAHRAKKA RAHMAN, SIVA GANESH




Attention! Feel free to leave feedback.