Divya Kumar - Black and White Lyrics

Lyrics Black and White - Divya Kumar



హే సిందర వందర లోకం
సందు గొందుల సీకటి నరకం
ఎహే పుట్టుకతో పేదరికం
తోడ బుట్టిన తొక్కలో జాతకం
ముక్కిపోయిన subsidy బియ్యం
నీళ్ళ బోరింగు కాడ కయ్యం
పొద్దు పొడిసిందంటే భయ్యం
గుర్తుకొస్తది ఆకలి దయ్యం
ఇంతకన్నా దారుణమేముంటదన్న మాటే ధైర్యం రారారారారా
మా black and white-u బస్తీ సూడన్న
ఏడ ఏసిన blanket ఆడే ఉందన్న
హే హే హే మా black and white-u బస్తీ సూడన్న
ఏడ ఏసిన blanket ఆడే ఉందన్న
హే సిందర వందర లోకం
సందు గొందుల సీకటి నరకం
ఎహే పుట్టుకతో పేదరికం
తోడ బుట్టిన తొక్కలో జాతకం
ఎల్లిపాయ కారం
నీళ్ల మజ్జిగన్నం
ఇదే మాకు బిర్యానితో సమానమని పూట గడుపుతాం
మురికి సంతలోనే ముక్కు మూసుకుంటాం
గట్టిగా గాలొస్తే పడే రేకుల కిందే కధను నడుపుతాం
లేనితనమే వారసత్వం ఉన్నదదే పంచిపెడతాం
మా పిల్లల పిల్లల పిల్ల తరాలకు పేదోళ్ళమై పుడతాం రారారారారా
మా black and white-u బస్తీ సూడన్న
ఏడ ఏసిన blanket ఆడే ఉందన్న
నెత్తిమీన రాకెట్లెన్నో పోతన్నా
మా పాకెట్లోనా పైసా nil అన్నా
తడికెల తానం అతుకుల మానం
ఆడ మగ ఎవ్వరికైన తప్పదు ఇది ఏమి సెయ్యగలం
పిడికెడు ప్యాను బండెడు భారం
తట్ట మొయ్యకుంటె పొట్ట గడవని పాపి జీవులం
కష్టాల దెబ్బలు తింటాం
కన్నీళ్ళు మింగుతుంటాం
ఇట్ట పుట్టించినోడిని తిట్టిన తిట్టు తిట్టకుండ తిడతాం రారారారారా
మా black and white-u బస్తీ సూడన్న
ఏడ ఏసిన blanket ఆడే ఉందన్న
నేల టిక్కెట్టు జిందగి మాదన్నా
ఇది balcony చేరే ఛాన్సే లేదన్నా



Writer(s): Ramajogayya Sastry, Sai Srinivas Thaman


Divya Kumar - Goutham Nanda
Album Goutham Nanda
date of release
16-07-2017




Attention! Feel free to leave feedback.