Lyrics Subhalekha Rasukunna - From "Naayak" - Shreya Ghoshal , Haricharan
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
చైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి
మల్లెమబ్బులాడెనేమో బాలనీలవేణికి
మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలే కధంతేలే అదంతేలే...
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్నచెట్టు నీడలో
వేసవల్లె వేచి ఉన్నా వేణుపూల తోటలో
వాలుచూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు
ఒళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు
అంతేలే కధంతేలే అదంతేలే...
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
Attention! Feel free to leave feedback.