Lyrics Neelakashamlo - From "Sukumarudu" - Shreya Ghoshal
నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో
నీవల్లే నీవల్లేరా సుకుమారా, ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళూ లేదిలా
సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిను చూస్తుంటే ఉండగలనా
నిన్నే దాచేసి లేవు పొమ్మంటా, నీకే నిన్నే ఇవ్వనంట
అరె నిన్నే తాకిందని గాలితోటి రోజూ గొడవేనంట
నిన్ను నువ్వైనా నాలాగ ప్రేమించలేవంట
నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
రహదారుల్లో పూలు పూయిస్తా, నా దారంటు వస్తానంటే
మహరాణల్లే నన్ను చూపిస్తా, నాపై కన్నే వేస్తానంటే
అరె ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడిచచ్చే నేనంటే నాకిష్టం
నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో
నీవల్లే నీవల్లేరా సుకుమారా, ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళూ లేదిలా

Attention! Feel free to leave feedback.