M.M.Keeravaani, Rita & Anuj Gurwara - Panchadaara Lyrics

Lyrics Panchadaara - M.M. Keeravani , Rita , Anuj Gurwara



పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవొద్దనకమ్మా
మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవొద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చెంతకే రావొద్దంటే ఏమౌతానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపోతే వృధా జన్మ
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపోతే వృధా జన్మ...
పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే
పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంట, పువ్వు చుట్టు ముళ్ళంటా,
అంటుకుంటే మంటే వొళ్ళంతా
తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే
మెరుపుతీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంటా, ఉరుము వెంట వరదంటా,
నే వరద లాగ మారితే ముప్పంటా
వరదైనా వరమని వరిస్తానమ్మా
మునకైనా సుఖమని ముడేస్తానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపోతే వృధా జన్మ...
గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది,
నేను నిన్ను తాకితే తప్పా?
గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది,
ఏమిటంట నీలోని గొప్ప?
వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడ తాకింది,
పక్షపాతమెందుకు నాపైన?
వెలుగు దారి చూపింది, చినుకు లాల పోసింది,
వాటితోటి పోలిక నీకేల?
అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా
నిను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపోతే వృధా జన్మ...



Writer(s): M.M. KEERAVANI, CHANDRABOSE


M.M.Keeravaani, Rita & Anuj Gurwara - Magadheera
Album Magadheera
date of release
27-06-2009



Attention! Feel free to leave feedback.