P. Susheela - Malle Pandiri Needalona Lyrics

Lyrics Malle Pandiri Needalona - P. Susheela

మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి
మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి
మా అన్నకు మా చంద్రికి ఇది తొలి రేయి నాకిది వరమోయి
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి తెల్లవారనీయకోయి రేయి
గడుసు పిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ
మొరటువాని మనసు దానికి పులకరించిందీ
గడుసుపిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ
మొరటువాని మనసు దానికి పులకరించిందీ
ఇద్దరికీ ఈనాడు నువ్వే ముద్దు నేర్పాలి
ముద్దు చూసి చుక్కలే నిను వెక్కిరించాలి
కళ్ళు కుట్టి వెళ్ళకోయి జాబిల్లి తెల్లవార నీయకోయి రేయి
పెళ్ళి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ
పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ
పెళ్లి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ
పసుపు తాడే నోచుకోని బ్రతుకు నాదీ
పెళ్ళి చూసి నేను కూడా ముత్తైదువైనాను
పుణ్ణెమే పై జన్మలో నను ఇల్లాలిని చేయాలి
మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి
మా అన్నకు మా చంద్రికి ఇది తొలి రేయి నాకిది వరమోయి
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి తెల్లవారనీయకోయి రేయి
ఊహూ ఊహూ ఊహూ ఊహూ
ఊహూ ఊహూ ఊహూ ఊహూ

P. Susheela - Mayadari Malligadu (Original Motion Picture Soundtrack)

Attention! Feel free to leave feedback.