S. P. Balasubrahmanyam feat. K. S. Chithra - Swapnavevedo - From "Ravoyi Chandamama" Lyrics

Lyrics Swapnavevedo - From "Ravoyi Chandamama" - S. P. Balasubrahmanyam , K. S. Chithra




స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేత పూల బాసలు కాలేవా చేతి రాతలూ
స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం
ప్రేమా నేనూ రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలూ అష్ట దిక్కులూ నిన్ను చూచు వేళా
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనేరాలా
కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా
నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం
వాలేదే ప్రణయ గోపురం
స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేత పూల బాసలూ కాలేవా చేతి రాతలూ
స్వప్నవేణువేదో సంగీత మాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే



Writer(s): VETURI, MANI SHARMA


Attention! Feel free to leave feedback.