S. P. Balasubrahmanyam feat. S. Janaki - Matarani - From "Maharshi" Lyrics

Lyrics Matarani - From "Maharshi" - S. P. Balasubrahmanyam , S. Janaki



మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగ గుండె రాగమిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దారబోసేది ఎప్పుడమ్మా
పాల నవ్వుల్లో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం
నింగీ నేలా కూడే వేళ. నీకూ నాకూ దూరాలేలా
అందరాని కొమ్మ ఇది. కొమ్మచాటు అందమిది
మాట రాని మౌనమిది. మౌనవీణ గానమిది
చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మా
రేయంత నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణానాదం కోరింది ప్రణయ వేదం
వేసారు గుండెల్లో రేగే గాయం పాడింది మధుర గేయం
ఆకాశాన తారాతీరం అంతే లేని ఎంతో దూరం
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది. కొమ్మచాటు అందమిది
కూడనిది జత కూడనిది చూడనిది మది పాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది



Writer(s): VENNELAKANTI, ILAYARAJA


S. P. Balasubrahmanyam feat. S. Janaki - S. P. Balasubrahmanyam - Telugu All Time Hits, Vol. 1




Attention! Feel free to leave feedback.