Sid Sriram - Ye Kannulu Chudani Chitrame (From "Ardhashathabdam") Lyrics

Lyrics Ye Kannulu Chudani Chitrame (From "Ardhashathabdam") - Sid Sriram



కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా
కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోన
దారికాస్తు ఉన్నా నిన్ను చూస్తు ఉన్నా
నువ్వు చూడగానే దాగిపోతు ఉన్నా
నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసే నా మనసు వెల్లువలా
తన లోలోనా
అందుకే నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
(స రి ప, ని గ, రి ని
రి ని రి రి
రి ని రి రి
రి ని రి రి, ని
నిదని పదనిస
నిదని పదనిస
నిదని పదనిస
గరిగ సరిగమ స)
రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా
నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిదీ తెలియదులే మనసుకిది మధురములే
నాలోనే మురిసి వేకువలా, వెలుగై ఉన్నా
అందుకే నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే



Writer(s): Nawfal Raja, Rahman


Sid Sriram - Ye Kannulu Chudani Chitrame (From "Ardhashathabdam") - Single




Attention! Feel free to leave feedback.