Chitra - Ye Swasalo (From "Nenunnanu") paroles de chanson

paroles de chanson Ye Swasalo (From "Nenunnanu") - Chitra



చిత్రం: నేనున్నాను (2004)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
వేణుమాధవా... వేణుమాధవా...
శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో (2)
మోవిపై వాలితే మౌనమే మంత్ర మౌతున్నదో
శ్వాసలో నే లీనమై మోవిపై నే మౌనమై
నినుచేరనీ మాధవా...
శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
మునులకు తెలియని జపములు జరిపినదా మురళీసఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకీ తరగని వరముల సిరులని తలచినదా
కృష్ణా నిన్నుచేరిందీ అష్టాక్షరిగ మారిందీ ఎలా ఇంత పెన్నిధీ వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధీ...
శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
మోవిపై వాలితే మౌనమే మంత్ర మౌతున్నదో
చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకీ నలువైపుల నడిరాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగులసడి వినబడక హృదయానికీ అలజడితో అణువణువూ తడబడదా
ఆ... నువ్వే నడుపు పాదమిది నువ్వేమీటు నాదమిది నివాళిగా నామది నివేదించు నిమిషమిది
వేణుమాధవా నీ సన్నిధీ...
గాగ్గరి గరి సరి గాగ్గ రీరి సరి గపద సాస్స దప గరి సరీ
దా ... దా ... ధా పా గా రీ గా
దప దసస్స దప దసస్స దప దరిర్రి దప దరిర్రి దసరి గరి సరీ గరి సరీ దా రి గారి సరిగా...
రిస దప గగగపాప్ప గగగదాస్స గగగ సాస్స దప గప గస రిస రిస రిగ రిస దసరీ గదప సగరీ
పగప దసరీ సరిగ పగరీ సద పదప సదస పదప సదస పదప రిసరి పదప రిసరి పద సరి గరి సద పదస గదప రిదస సరిగ పద సరిగా...
రాధికా హృదయ రాగాంజలీ నీ పాదముల వ్రాలు కుసుమాంజలీ గీతాంజలీ...



Writer(s): M.M. KEERAVANI, SIRIVENNELA SITARAMA SASTRY


Attention! N'hésitez pas à laisser des commentaires.