G Balakrishna Prasad - Munula Tapamunade paroles de chanson

paroles de chanson Munula Tapamunade - G. Balakrishna Prasad




మునులతపమునదే మూలభూతియదే
వనజాక్షుడే గతి వలసినను
నరహరి నామము నాలుకనుండగా
పరమొకరినడుగ పనియేలా
చిరపుణ్యమునదే జీవరక్షయదే
సరుగగాచు ఒకసారే నుడిగిన
మునులతపమునదే మూలభూతియదే
వనజాక్షుడే గతి వలసినను
మనసులోననే మాధువుడుండగా
వెనుకనియొకచో వెదకకనేటికి
కొనకు కొనయదే కోరేడిదదియే
తనుదారక్షించు తలచినను
మునులతపమునదే మూలభూతియదే
వనజాక్షుడే గతి వలసినను
శ్రీ వెంకటపతి చేరువనుండగా
భావకర్మముల భ్రమయగనేటికి
దేవుడునతడే తెరువునదియే
కావలెనంటే కావకపోడు
మునులతపమునదే మూలభూతియదే
వనజాక్షుడే గతి వలసినను



Writer(s): G. Balakrishna Prasad, Tallapaka Annamacharya



Attention! N'hésitez pas à laisser des commentaires.