paroles de chanson Vaana Chinukulu - From "Seethamma Vakitlo Sirimalle Chettu" - Karthik feat. Anjana Sowmya
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరె అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్ళాలువేసి ఇక అల్లాడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
నీ వలన తడిసా
నీ వలన చలిలో చిందేసా
ఎందుకని తెలుసా
నువ్వు చనువిస్తావని ఆశ
జారుపవిటని గొడుగుగ చేసానోయ్
అరె ఊపిరితో చలి కాసానోయ్
హే' ఇంతకన్న ఇవ్వదగ్గదెంతదైన ఇక్కడుంటే తప్పకుండ ఇచ్చితీరుతాను చెబితే
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
సిగ్గులతో మెరిసా
గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్దులుగ కురిశా
ఒళ్ళు హరివిల్లుగ వంచేసా
నీకు తొలకరి పులకలు మొదలైతే
నా మనసుకి చిగురులు తొడిగాయే
నువ్వు కుండపోతలాగా వస్తే బిందెలాగ ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరె అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్ళాలువేసి ఇక అల్లాడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే
Attention! N'hésitez pas à laisser des commentaires.