P. Susheela feat. S. P. Balasubrahmanyam - Illage Illage - From "Vayasu Pilichindi" paroles de chanson

paroles de chanson Illage Illage - From "Vayasu Pilichindi" - S. P. Balasubrahmanyam , P. Susheela




ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం యవ్వనం ఊయలూగునే
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం యవ్వనం ఊయలూగునే
వయసులో వేడుంది మనసులో మమతుంది
వయసులో వేడుంది మనసులో మమతుంది
మమతలేమో సుధామయం మాటలేమో మనోహరం
మదిలో మెదిలే మైకమేమో
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం యవ్వనం ఊయలూగునే
కంటిలో కదిలేవు జంటగా కలిశావు
కంటిలో కదిలేవు జంటగా కలిశావు
నీవు నేను సగం సగం కలిసిపోతే సుఖం సుఖం
తనువు మనసు తనివి రేపునే
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం యవ్వనం ఊయలూగునే
భావమే నేనైతే పల్లవే నీవైతే
భావమే నేనైతే పల్లవే నీవైతే
ఎదలోనా ఒకే స్వరం కలలేమో నిజం నిజం
పగలు రేయి ఏదో హాయి
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం యవ్వనం ఊయలూగునే
ఊయలూగునే
ఆహహాహహహ
సాహిత్యం: ఆరుద్ర:వయసు పిలిచింది:ఇళయరాజా: బాలు, సుశీల



Writer(s): Ilayaraja, Arudra


Attention! N'hésitez pas à laisser des commentaires.