paroles de chanson Sarikotta Chira (From "Pellipustakam") - S. P. Balasubrahmanyam
సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించినాను...
మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెలరాశికి సిరిజోత...
నా వన్నెలరాశికి సిరిజోత...
ముచ్చటగొలిపే మొగలిపొత్తుకు...
ముల్లూ వాసనా ఒక అందం...
అభిమానం గల ఆడపిల్లకు అలకా కులుకూ ఒక అందం
నీ అందాలన్నీ కలబోశా...
నీ కొంగుకు చెంగును ముడివేస్తా.ఆ
నీ అందాలన్నీ కలబోశా...
నీ కొంగుకు చెంగును ముడివేస్తా... ఆ
ఇది ఎన్నో కలల కలనేత
నా వన్నెలరాశికి సిరిజోత... ఆఆ
నా వన్నెలరాశికి సిరిజోత
చురచుర చూపులు ఒకమారు
నీ చిరుచిరు నవ్వులు ఒకమారు
మూతివిరుపులు ఒకమారు
నువు ముద్దుకు సిద్ధం ఒకమారు...
నువు ఏ కళనున్నా మాబాగే... ఈ చీర విశేషం అల్లాగే
నువు ఏ కళనున్నా మాబాగే ఈ చీర విశేషం అల్లాగే...
సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించినాను...
మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెలరాశికి సిరిజోత... ఆ
నా వన్నెలరాశికీ... సిరిజోత... ఆ
చిత్రం: పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: బాలు

Attention! N'hésitez pas à laisser des commentaires.