S. P. Balasubrahmanyam - Yemako paroles de chanson

paroles de chanson Yemako - S. P. Balasubrahmanyam




ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
ఏమొకో ...
కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన చెలువము
కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన చెలువము
ఇప్పుడిదేమో చింతింపరేచెలులు
నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా
ఏమొకో ఏమొకో .
ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
ఏమొకో ...
ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కామిని వదనాభుజముల
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా
ఏమొకో ఏమొకో .
ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
ఏమొకో ...
(దిలీప్ చక్రవర్తి)




Attention! N'hésitez pas à laisser des commentaires.