Текст песни




అనుకోనేలేదుగా కల కానేకాదుగా
కలిసొచ్చే కాలమల్లే నిలిచావులే
అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలొచ్చే తీరమల్లే కలిసా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరోసగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరోజగమైతే మనమేలే
సుఖాలన్నీ మన చుట్టూ చేరెనే
శుభాలన్నీ మన చుట్టమయ్యే నేడే
ఐదు ప్రాణాల సాక్షిగా నాల్గు కాలాల సాక్షిగా
మూడుపూటల్లో రెండుగుండెల్లో ఒక్కటే ప్రేమగా
కొంటె దూరాలు కొద్దిగా కంటినేరాలు కొద్దిగా
కొన్ని కౌగిళ్ళు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా
ఉల్లాసమే ఉద్యోగమాయే సంతోషమే సంపాదనాయే
ఇదే బాటై ఇదే మాటై ఇలాగే లోకలనేలాలిలే
ఒకే నువ్వు ఒకే నేను చెరోసగమైతే ప్రేమేలే
ఒకే నవ్వూ ఒకే నడక మరోజగమైతే మనమేలే
అనుకోనేలేదుగా కల కానేకాదుగా
కలిసొచ్చే కాలమల్లే నిలిచావులే
నువ్వనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలొచ్చే తీరమల్లే కలిసా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరోసగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరోజగమైతే మనమేలే



Авторы: Yuvan Shankar Raja, Chandrabose



Внимание! Не стесняйтесь оставлять отзывы.
Загрузка
Загрузка