Yuvan Shankar Raja - Panjaa текст песни

Текст песни Panjaa - Yuvan Shankar Raja




నీ చురచుర చూపులే పంజా
సలసలసల ఊపిరే పంజా
నరనరమున నెత్తురే పంజా
అణువణువున సత్తువే పంజా
అదుపెరగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా
పెదవంచున మౌనమే పంజా
పదునగు ఆలోచనే పంజా
చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి
తప్పదనే యుద్ధముగా వేకువ చూడద రేపటి కాంతి
ఆకాశం నీ పంజా...
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా...
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా
ఆటుపోటు లేనేలేని సాగరమే ఉంటుందా
ఎత్తు పల్లం లేనేలేని రాహదారంటూ ఉందా
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా
ఏదేమైన తుదివరకు ఎదురీత సాగాలిగా...
అడుగడుగూ అలజడిగా
నీ జీవితమే నీ శత్రువు కాగా
బెదిరించే ఆపదనే ఎదిరించే గుణమేగా పంజా...
ఆకాశం నీ పంజా...
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా...
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా



Авторы: RAMAJOGAYYA SASTRY, YUVAN SHANKAR RAJA



Внимание! Не стесняйтесь оставлять отзывы.