K Kay - O Sathiya текст песни

Текст песни O Sathiya - K Kay




సాతియా సాతియా
చూపుకే పడిపోయా
నా ప్రియా నా ప్రియా
నా నుండి నే విడిపోయా
ఒక నువ్వు ఒక నేను
ఒకటైతేనే కద ప్రేమ
ఒక చోటే అనుకుంటే
మన ఇద్దరిది చిరునామా
సాతియా సాతియా
చూపుకే పడిపోయా
నా ప్రియా నా ప్రియా
నా నుండి నే విడిపోయా
నా మనసంతా చెరిపి
నీ రూపం గీసావే
నీ బరువే మోపి నను తేలిక చేసావే
నా మనసంతా చెరిపి
నీ రూపం గీసావే
నీ బరువే మోపి నను తేలిక చేసావే
నీ శకునం కోసం చూసే
ప్రతి సెకనుకు నిమిషాలెన్నో
నీ హృదయం కోసం వేసే
ప్రతి అడుగున దూరలెన్నో
కంటిరెప్ప ఎప్పుడూ చెయ్యలేదు చప్పుడు
నిన్ను చూడనప్పుడు సూటిగా
దూరముంటే అమ్మలా దగ్గరుంటే బొమ్మలా
గంటకొక్క జన్మలా ఉందిగా
సాతియా సాతియా
చూపుకే పడిపోయా
నా ప్రియా నా ప్రియా
నా నుండి నే విడిపోయా
నా తనువంతా నువ్వై
తలకిందిలు అయ్యానే
జ్ఞాపకమే నువ్వై జీవితమే మరిచానే
నా తనువంతా నువ్వై
తలకిందిలు అయ్యానే
జ్ఞాపకమే నువ్వై జీవితమే మరిచానే
నా గుండెల చప్పుడుకన్నా
నీ అలికిడితో బ్రతికున్నా
నను కాదని తెలిసిన సమయం
నా ఊపిరికెందుకు ప్రాణం
ప్రేమ తేనే పట్టని ఆశ పాము పుట్టని
ప్రేయసంటే అర్థమే మారెనా
వెంటపడ్డ నీడని అచ్చమైన నువ్వని
వేలుపట్టి లోకమే దాటనా
సాతియా సాతియా
చూపుకే పడిపోయా
నా ప్రియా నా ప్రియా
నా నుండి నే విడిపోయా
ఒక నువ్వు ఒక నేను
ఒకటైతేనే కద ప్రేమ
ఒక చోటే అనుకుంటే
మన ఇద్దరిది చిరునామా



Авторы: Shyamlal Harlal Rai Indivar, Kalyanji Anandji



Внимание! Не стесняйтесь оставлять отзывы.