M. M. Keeravani & Chitra - Nallka Nallani (From "Sye") текст песни

Текст песни Nallka Nallani (From "Sye") - M. M. Keeravani & Chitra




చిత్రం: సై (2004)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యేవాడెల్లా వుండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా...!
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యేవాడెల్లా వుండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా...!
ఎర్రంగా బొద్దుగా వుంటే చాలా
ఒళ్ళో పెట్టుకు లాలిపాడి జో కొట్టాలా
అడుగులకే మడుగులు ఒత్తేవాడే మేలా
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
ఒప్పులకుప్ప వయారి భామా ముద్దులగుమ్మ చెప్పవెబొమ్మ...
ఒప్పులకుప్పకి వయారి భామకి నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
... నేనా... నీతో... సరిపోతానా?
నల్లా నల్లాని కళ్ళ పిల్లాడా నువు పెళ్ళాడేదెల్లా వుండాలి కొంచెం చెప్పమ్మా...!
తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి దాన్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా...!
నల్లా నల్లాని కళ్ళ పిల్లాడా నువు పెళ్ళాడేదెల్లా వుండాలి కొంచెం చెప్పమ్మా...!
మెత్తంగా పువ్వులా ఉంటే చాలా...
మొత్తంగా తానే చేసుకు పోతుండాలా...
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
సై అంటే సై అని బరిలో దూకెయ్యాలా
కాళ్ళా గజ్జా కంకాళమ్మా ఎవరో యమ్మా ఖజురహొ బొమ్మ...!
ఇంకెందుకులే దాపరికమ్మా నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా
చీ ... నేనా...? నీతో... సరిపోతానా...
సిగ్గుల మొగ్గల బూరెల బుగ్గల
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నిను పెళ్లాడేవాణ్ణిల్లా ఊరించి ఉడికించొద్దమ్మా
తెల్లారే సరికల్లా మనమోల్లాగోలాగ మొగుడూ పెళ్లాలైపోయే దారి కాస్త చూపించెయ్యమ్మా...



Авторы: M.M. KEERAVANI, SHIVASAKTHI DATTA


Внимание! Не стесняйтесь оставлять отзывы.