Текст песни Pallakilo Pelli Koturu (From "Pallakilo Pelli Koturu") - S. P. Balasubrahmanyam , K. S. Chithra
చిత్రం: పల్లకిలో పెళ్ళికూతురు (2004)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
చంపకు చుక్కను పెట్టి పాదాలకి పారాణి పూసి
చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి
మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో
పల్లకిలో...
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
రాణి గారికి సిగ్గుల వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిధిగా వచ్చే
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
మా గూటిలో ఎదిగిన బంగరు బొమ్మా
బంగరు బొమ్మా బంగరు బొమ్మా
మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ
వెన్నెల బొమ్మా వెన్నెల బొమ్మా
పరిమళాల గంధపు బొమ్మా సున్నితాల గాజు బొమ్మా
పుట్టినింట లేతబోమ్మా మెట్టినింట సీతవమ్మా
ఈ బొమ్మను అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము
మాటరాని బొమ్మలమయ్యాము
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
నా పెళ్ళిలో అతిధులు మీరేకదా
అతిధులంటే దేవుళ్ళనే అర్ధం కదా
ఈ పందిరి మీ రాకతో మందిరమే అయ్యింది
నాపై మీ చల్లని చూపే వరముల వరదయింది
ఈ అతిధి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యాముగా నువ్వుండాలని
నీ బ్రతుకంతా బాగుండాలనీ...
పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
రాణి గారికి సిగ్గులు వచ్చే రాజుగారికి చిరునవ్వొచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిధిగా వచ్చే

Внимание! Не стесняйтесь оставлять отзывы.